ఎన్టీఆర్ సినిమాపై కొత్త అప్డేట్!

ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ‘జైలవకుశ’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాతాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఇప్పుడు ఆ పాత్రకు నత్తిని కూడా యాడ్ చేయబోతున్నారు. అవునండీ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు నత్తి ఉంటుందట. మొన్నటివరకు ఓ తండ్రి ఇద్దరుకొడుకులు ముగ్గురు ఒకే విధంగా ఉండే కథని ప్రచారం జరిగింది.

తాజాగా మరో స్టోరీ లైన్ వినిపిస్తోంది. ఇద్దరు సవతి భార్యల కొడుకుల మధ్య జరిగే కథని సమాచారం. ఆ ముగ్గురు కొడుకుల పాత్రలను ఎన్టీఆర్ పోషించనున్నాడు. అందులో ఒకటి ప్రభుత్వ ఉద్యోగి పాత్ర కాగా.. మరొకటి డాన్సర్ పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశిఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.