HomeTelugu Big Storiesఆ రెండు భాషల్లోనూ.. 'వినయ విధేయ రామ'

ఆ రెండు భాషల్లోనూ.. ‘వినయ విధేయ రామ’

7 22మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా జనవరి 11 న విడుదలై డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. 10 రోజుల్లో రూ.60 కోట్లు వసూలు చేసి మాస్ లో రామ్ చరణ్ కు ఉన్న స్టామినాను రుజువు చేసుకుంది. ఈ సినిమాను ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ప్రకాష్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేయబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లకు రిలీజ్ చేశారు. రీలీజైనా కొద్దిసేపటికే యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu