ఎన్టీఆర్ కు కథ నచ్చింది కానీ..!

‘జనతాగ్యారేజ్’ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయాలో అని చాలా కథ విన్నాడు. దాదాపు పది మంది దర్శకులతో భేటీ అయ్యాడు.  వారంతా చెప్పిన కథలు, లైన్స్ అన్నీ విన్నాడు. కానీ ఎవరితో సినిమా చేయాలనే విషయంలో క్లారిటీ రాలేదు. దర్శకుడు బాబీను ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ కథ చెప్పమన్నాడు. బాబీ చెప్పిన లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని తీసుకొని రమ్మని చెప్పాడట ఎన్టీఆర్. కాస్త  సమయం తీసుకొని ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చాడు బాబీ. ఈ కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. అయితే తన డెసిషన్ మాత్రం చెప్పట్లేదు.

కొందరి దర్శకులకు తనకు ఎలాంటి కథ కావాలో ఇన్ పుట్స్ కూడా ఇస్తున్నాడట. మరి బాబీతో సినిమా చేస్తాడా..? మరొక దర్శకుడితోనా..? అనే  విషయంలో స్పష్టత రావట్లేదు. అయితే బాబీ మాత్రం ఈ విషయంలో సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కథ నచ్చింది కాబట్టి ఇప్పుడు కాకపోతే  తరువాత అయిన సినిమా చేసే అవకాశం ఉంది. బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్ ను అంతగా ఆకట్టుకుంది. మరి ఇంకా ఈ విషయంలో ఎన్టీఆర్ ఎందుకు  అంతగా ఆలోచిస్తున్నాడో.. ఆయనకే తెలియాలి!