HomeTelugu Trendingఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడంటే?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడంటే?

NTR with Trivikram
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను వేసవిలో ప్రారంభిచబోతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ పుట్టినరోజున షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. దీనికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట. ఇందులో రాజకీయ నాయకుడిగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కరికీ కొత్త తరహా పాత్రలను త్రివిక్రమ్ అద్భుతంగా రూపొందించినట్లు చెప్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu