
Odela 2 OTT release date:
టాలీవుడ్‌లో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “ఓడెలా 2” మే 8, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథను సంపత్ నంది అందించారు. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి హైప్‌ని క్రియేట్ చేస్తోంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రస్తుతం ఈ సినిమా అందుబాటులో ఉంది. కానీ సినిమా విడుదలకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించినట్లుగా ఐదు భాషల్లో విడుదల చేస్తామని చెప్పారు – ఇందులో మలయాళం, కన్నడ భాషలు కూడా ఉన్నాయి. కానీ సినిమా డిజిటల్ రిలీజ్ అయి అయిదు రోజులు కావొస్తున్నా, ఇంకా ఆ రెండు భాషల్లో అందుబాటులో లేదు. దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో చాలా మంది యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు.
#Odela2 on #AmazonPrime from tomorrow.#TamannaahBhatia #Tamannaah pic.twitter.com/gZtWdxozGj
— TeluguOne (@Theteluguone) May 7, 2025
ముఖ్యంగా మల్టీ లాంగ్వేజ్ రీలీజ్ అనే ప్రమోషన్ మీద నమ్మి వేచిచూస్తున్న ప్రేక్షకులు ఇక సోషల్ మీడియాలో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. సినిమాకు టాప్ ట్రెండ్స్‌లో చోటు దక్కడం ఒక వైపు అయితే, ఇలా భాషల విళంబంతో యూజర్ల నమ్మకాన్ని కోల్పోవచ్చు అన్న ఆందోళన ఇంకొక వైపు ఉంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నది – మలయాళం, కన్నడ వెర్షన్స్ ఎప్పుడు వస్తాయో అనే విషయంపై స్పష్టత. ఇదే సమయంలో, “ఓడెలా 2” మూవీ టీమ్ ఈ విషయంలో ఏమైనా స్పందిస్తారా? లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈ సమస్యను ఎప్పుడు క్లారిఫై చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
ALSO READ: Prabhas Summer Vacation కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?