ఆ రోజే ప్రభాస్ పెళ్లి ప్రకటన..!

టాలీవుడ్‌ లో తరచు వినిపించే హాట్ టాపిక్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం. ఇప్పటికే అనేకసార్లు తెరమీదికొచ్చిన ఈ అంశం అభిమానులు, మీడియా సర్కిల్స్ లో ఎప్పుడూ కొత్తగానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడ ఈ విషయమై కొత్త వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ వయసు 38 సంవత్సరాలు కాగా వచ్చే నెల 23న ఆయన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు. అదే రోజున ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేస్తారట. అంటే వివాహమెప్పుడు, పెళ్లి కుమార్తె ఎవరు అనే విషయాలన్నమాట. వార్తల సంగతి పక్కనబెడితే ఇంకో ఏడాది గడిచిందంటే ప్రభాస్ కు 40 ఏళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ఈ 39వ ఏటనే అయన పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారని వెల్లడించారు.