HomeTelugu Big Storiesరివ్యూ: జయ జానకి నాయక

రివ్యూ: జయ జానకి నాయక

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, శరత్ కుమార్, వాణి విశ్వనాధ్ తదితరులు 
సంగీతం: దేవిశ్రీప్రసాద్ 
సినిమాటోగ్రఫీ: రిషి
నిర్మాత: రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జయ జానకి నాయక’. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
 
కథ:
చక్రవర్తి గ్రూప్ అఫ్ కంపెనీస్ ఎండీ చక్రవర్తి (శరత్ కుమార్) ఇద్దరు కుమారుల్లో గగన్(బెల్లంకొండ శ్రీనివాస్) ఒకడు. కొడుకులతో చక్రవర్తి ఒక స్నేహితుడిగా ఉంటాడు. గగన్ కు కాలేజీలో స్వీటీ(రకుల్ ప్రీత్ సింగ్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. స్వీటీ.. గగన్ ఫ్యామిలీకు కూడా దగ్గరవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దానికి స్వీటీ తండ్రి జె.పి అంగీకరించడు. దీంతో స్వీటీ.. గగన్ కు దూరమవుతుంది. ఆపై అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటుంది. స్వీటీ కష్టానికి కారణం ఎవరు? ఆ విషయాలు గగన్ కు తెలుస్తాయా..? తెలిస్తే వాటిని ఎలా పరిష్కరిస్తాడు..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.
 
విశ్లేషణ:
పంతం, పరువు ఈ రెండిటి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి, తనను కాపాడుకోవడానికి ప్రయత్నించే ఓ యువకుడు మధ్య నడిచే కథే ఈ సినిమా. ఈ ప్రేమ కథ చుట్టూ  బోయపాటి స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాగా తెరకెక్కించారు. అతని నుంచి ఆడియన్స్ ఏవైతే ఆశించి సినిమాకి వెళ్తారో అలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా ఉంటాయి. సినిమాలో సెకండ్ మేజర్ పాయింట్ అంటే అది హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టొరీ. ప్రేమించే వారి కోసం ఎంత వరకైనా వెళ్ళొచ్చు అనే అంశాన్ని బోయపాటి ప్రెజెంట్ చేసిన విధానానికి యూత్, ఫ్యామిలీ ఫుల్ గా ఫిదా అయిపోతారు. బోయపాటి మార్క్ లో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా ఆడియన్స్ బాగా కనెక్టవుతారు.
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో నటన పరంగా, డాన్సులు పరంగా  బాగా పరిణితి చెందాడు. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. తన మేకోవర్ చాల బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. శరత్ కుమార్ తన నటనతో మెప్పించారు. జగపతిబాబు పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది. తరుణ్ అరోరా, నందు, వాణి విశ్వనాధ్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. 
సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్ నేపద్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఒక్కో విలన్ కు దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రశంసనీయం. పాటలు కూడా బాగున్నాయి. అయితే సినిమా మొత్తం యాక్షన్ ఉండడం, సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ ఓవర్ డోస్ అవ్వడంతో క్లాస్ ఆడియన్స్ కు ఈ సినిమా ఎంతవరకు నచ్చుతుందో చెప్పలేం. కానీ బి,సి సెంటర్స్ ఆడియన్స్ కు మాత్రం సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. 
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కాస్త కంటెంట్ లో కొత్తదనం కోరుకుంటున్నారు. అయితే అలాంటి కొత్తదనం ఈ సినిమా నుండి ఆశించలేం. కానీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అవ్వలేదు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu