పవన్, నితిన్ సినిమా కొత్త అప్డేట్!

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని చాలా కాలం అవుతున్నా.. ఇప్పటివరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయిందనే వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలకు తెరదించుతూ.. తాజాగా ఓ వార్త బయటకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది ఆ వార్తల సారాంశం.

ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం నితిన్ ‘లై’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అమెరికాలో జరుగుతోన్న ఈ షూటింగ్ నుండి తిరిగి ఈ నెల 14న ఇండియాకు రానున్నాడు. ఆ తరువాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని పవన్ నిర్మాణంలో షూటింగ్ లో పాల్గొనున్నాడు. దర్శకుడు కృష్ణచైతన్య ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.