పవన్ సినిమా నుండి తప్పుకున్నాడు!

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ తరువాత పవన్ కల్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సినిమా ప్రారంభం
కావడం అదే సమయంలో సూర్యకు నటుడిగా అవకాశాలు రావడంతో ఆ ప్రాజెక్ట్ నుండి
తప్పుకోవడం జరిగిపోయాయి. ఆయన స్థానంలోకి డాలీ వచ్చి చేరాడు. కథలో కొన్ని మార్పులు
కూడా చేశాడు. ఈ చిత్రానికి ‘కాటమరాయుడు’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. మొదట ఈ
సినిమాకు కెమెరామెన్ గా సౌందర్ రాజన్ ను తీసుకున్నారు. అయితే రోజురోజుకి షూటింగ్
ఆలస్యమవుతూ రావడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఆయన
స్థానంలోకి ప్రసాద్ మూరెళ్లను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఒకరి తరువాత ఒకరు ప్రాజెక్ట్
నుండి తప్పుకోవడం పవన్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తుంది.