HomeTelugu Big Storiesమల్లయోధులను ఢీకొట్టనున్న పవన్‌ కళ్యాణ్‌

మల్లయోధులను ఢీకొట్టనున్న పవన్‌ కళ్యాణ్‌

Pawan kalyan 27th movie up

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మధ్య 17వ శతాబ్దపు చార్మినార్‌ సెట్‌ వేయించిన క్రిష్‌ ఇప్పుడక్కడ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ కొనసాగుతుండగా మల్లయోధులతో వీరోచిత పోరాటానికి రెడీ అయ్యాడట పవన్‌. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు ప్రత్యక్షమవగా క్షణాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోలో భారీ దేహాలు ఉన్న మల్లయోధులతో పవన్‌ హోరాహోరీగా తలపడేటట్లు కనిపిస్తోంది. ఈ పహిల్వాన్లతో పవన్‌ కలిసిన ఫొటో ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. వజ్రాల దొంగలా కనిపించనున్న పవన్‌ గెటప్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట క్రిష్‌. ఇక ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌.. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు పాత్రలో నటిస్తుండగా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ కీలక పాత్ర చేస్తోంది. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో 27వ చిత్రం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Pawan kalyan 27th movie lat

Recent Articles English

Gallery

Recent Articles Telugu