చైతు-సామ్ వర్కవుట్ అయ్యే చాన్సే లేదు!

వెండితెరపై సమంత-నాగచైతన్య అంటే హిట్ పెయిర్. సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ జంట నిజజీవితంలో కూడా భార్య భర్తలు కాబోతున్నారు. దీంతో వీరిద్దరు కలిసి సినిమా చేస్తే బావుంటుందని అందరూ ఆశించారు. అక్కినేని అభిమానుల్లో ఆ కోరిక మరింత బలంగా ఉంది. దానికి తగ్గట్లుగానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో అని వార్తలు వచ్చాయి.

నిజానికి వీరి కాంబినేషన్ లో సినిమా రావడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదిరే పని కాదు. చైతు రెండు సినిమాలు చేస్తున్నాడు.. అలానే సమంత చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ కు ఉన్న కమిట్మెంట్స్ గురించి చెప్పనక్కర్లేదు. పవన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు ఇలా చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తైతే కానీ చైతుతో సినిమా చేసే అవకాశాలు లేవు.