HomeTelugu Trending'బ్రో' టీజర్‌ పవన్‌ కళ్యాణ్‌ డబ్బింగ్‌ పూర్తి

‘బ్రో’ టీజర్‌ పవన్‌ కళ్యాణ్‌ డబ్బింగ్‌ పూర్తి

Pawan Kalyan Bro Teaser Dub

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాయకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ పలు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో బ్రో ఒకటి. తన సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు ఈ సినిమాపై మంచి హైప్స్‌ని తెచ్చిపెట్టాయి. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ అప్డేట్‌ని విడుదల చేయనున్నట్లు టాక్‌.

ఈ క్రమంలో తాజాగా పవన్ టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్‌ పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు సముద్రఖనితో ఉన్న ఫోటోలను పోస్ట్‌ చేసింది. కాగా ప్రస్తుతం పవన్‌ భీమవరంలో ఉన్నాడు. దాంతో బ్రో యూనిట్ స్వయంగా భీమవరంకు వచ్చి పవన్‌తో డబ్బింగ్ కంప్లీట్‌ చేసుకుంది. పీపుల్‌ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న జులై 28న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu