HomeTelugu Trendingకౌబాయ్‌గా మహేష్ మేనల్లుడు.. మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

కౌబాయ్‌గా మహేష్ మేనల్లుడు.. మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

Ashok Galla Birthday Specia
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఫిక్స్‌ కాలేదు. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న అశోక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ ని విడుదల చేసి ఇది సూపర్ కూల్ గా ఉందని.. ఆన్ స్క్రీన్ లో నిన్ను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. రాకింగ్ ఇయర్ ముందుందని పేర్కొన్నారు. ఈ మోషన్ పోస్టర్ లో గల్లా అశోక్ కౌబాయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఉగాదికి ఈ సినిమా టైటిల్ లాంచ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ – గల్లా అరుణకుమారి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, సీనియర్ నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu