‘మహర్షి’కి ఇంప్రెస్ అయిన పవన్ ఫ్యాన్స్!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి’ మే 9న విడుదల కానుంది. ఈ సందర్బంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడికి చేస్తున్నారు. వాళ్ళ హడావుడికి ఈరోజు పవన్ అభిమానులు కూడా తోడయ్యారు. అందుకు కారణం ఈరోజు చిత్ర టీమ్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్. అందులో మహేష్ బాబు గాజు గ్లాసులో టీ తాగుతూ సామాన్యుడిలా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్ చూసి పవన్ ఫ్యాన్స్ ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే పవన్ స్థాపించిన జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసే కాబట్టి. అలా తమ గ్లాసును మహేష్ చేతిలో చూసేసరికి పవన్ అభిమానుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.