‘అజ్ఞాతవాసి’ రొమాంటిక్ స్టిల్!

అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్ ఓ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యూయేల్ నటిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ స్టిల్ లీక్ అయ్యింది. చిత్ర బృందం అనుమతి లేకుండా బయటకు వచ్చిన ఈ స్టిల్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసింది నిర్మాణ సంస్థ. 

ఇక, లీకైన పిక్ విషయానికొస్తే.. హీరోయిన్ కీర్తి సురేష్ తో రొమాంటి మూడ్ లో ఉన్న పవన్ స్టిల్ ఇది. దీంతో.. సినిమాలో రొమాన్స్ కి ఢోకా లేనట్టు కనబడుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఝాతవాసి వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ముందు ఈ నెల 16న టీజర్ విడుదల కానుంది. ఈ నెల 19న ఆడియో వేడుక జరగనుంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తాడని సమాచారం.