‘జై లవకుశ’కు ఆ ఛాన్స్ లేదేమో!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించే విధంగా అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రాల శ్రేయస్సు కోసం గత కొంతకాలంగా ఈ ప్రతిపాదనను అమలు చేయమని ప్రభుత్వానికి సినీ పరిశ్రమ విన్నవించుకుంది. ఎట్టకేలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. దసరా నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఐదు షోలు మొదలైపోతాయని ఆ అడ్వాంటేజ్ పొందే మొదటి సినిమా ‘జై లవకుశ’ అవుతుందనే ప్రచారం జరిగింది. 
దీంతో ఎన్టీఆర్ సినిమా మొదటి వీకెండ్ లో కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన ఎలాంటి సంకేతాలు కూడా కనిపించడం లేదు. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సింగిల్ స్క్రీన్ లలో నాలుగు షోలకే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాకు ఆడియన్స్ లో ఉన్న హైప్ ను బట్టి అన్ని షోలు కూడా ఫుల్ అవ్వడం ఖాయం. ఇక ఐదో షో కూడా అమలులోకి వస్తే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి అదనపు షో అసలు అమలులోకి వస్తుందేమో చూడాలి!