నేను మాట్లాడకపోవడానికి కారణం అదే!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి వచ్చిన తరువాత నేను ఎప్పుడు ఎవరినీ పెద్దగా ప్రశ్నించలేదు. ప్రతీదీ రూల్ ప్రకారం వెళ్తే కష్టం అనే విషయం తెలుసు కాబట్టి నేను అలా చేశాను. వోట్లకు నోట్లు విషయంలో నేను మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే. ప్రతి విషయంలో గొడవలు
పెట్టుకుంటూ పోతే ముందుకు వెళ్లలేమ్. సమస్యలు కూడా పరిష్కారం కావు.. ఆ ఉద్దేశంతోనే నేను పెద్దగా స్పందించలేదు అంతేకానీ వాళ్ళను వెనకేసుకొచ్చే ఉద్దేశం నాకు లేదు.. అంటూ గతంలో తనపై వచ్చిన ఆరోపణలకి వివరణ ఇచ్చారు పవన్ కల్యాణ్.

బీజేపీ నుండి బలమైన డెమోక్రసీ కావాలని యువత కోరుకుంది. కానీ బీజేపీ మాత్రం ఒంటెద్దు పోకడలు పోతోంది. బీజేపీ పార్టీనీ కానీ, ఆ పార్టీ నాయకులను అర్ధం చేసుకునే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు మాత్రం ప్రజా సమస్యల్ని అర్ధం చేసుకోలేకపోతున్నారని ఆ పార్టీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.