HomeTelugu Big Storiesరివ్యూ: బాబు బాగా బిజీ

రివ్యూ: బాబు బాగా బిజీ

నటీనటులు: అవసరాల శ్రీనివాస్, మిస్టీ చక్రవర్తి, సుప్రియా, తేజస్విని, శ్రీముఖి , ప్రియదర్శి
తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: నవీన్ మేడారం
నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. బాలీవుడ్ సినిమా ‘హంటర్’ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ రేంజ్ లో ఆడియన్స్ కు కనెక్ట్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
మాధవ్(శ్రీనివాస్ అవసరాల) టీనేజ్ నుండి అమ్మాయిల పట్ల, శృంగారం పాటల్ ఆసక్తి కనబరుస్తూ చాలా మందితో ఎఫైర్స్ నడిపిస్తూ ఉంటాడు. ఇక కొన్నేళ్ళకు ఈ పనులన్నీ మానేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా పెళ్లి చూపుల ద్వారా రాధ (మిస్తి చక్రబర్తి) ని కలిసి, తన గతం గురించి ఆమె దగ్గర దాచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెడు తిరుగుళ్ళు మానేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగిన తరువాత రాధకు తనొక సెక్స్ అడిక్ట్ అనే విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకుంటాడు మాధవ్. మరి ఆ విషయాన్ని మాధవ్ చెప్పగలిగాడా..? రాధ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది..? వీరిద్దరికి వివాహం జరుగుతుందా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
అడల్ట్ కామెడీతో కూడుకున్న కథను ఎంటర్టైన్మెంట్ వే లో చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమా మొత్తం రొటీన్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశాలు మినహా సినిమా మొత్తం బోరింగ్ గా అనిపిస్తుంది. హంటర్ సినిమాను మక్కీమక్కీకి దించేశారు. శ్రీనివాస్ అవసరాల ఇన్నోసెంట్ ప్లే బాయ్ గా మంచి నటన కనబరచడానికి సాయశక్తులా ప్రయత్నించి చాలా చోట్ల మెప్పించాడు. అతడు చెప్పే డైలాగ్స్ కొన్ని ఆకట్టుకుంటాయి.
మిస్టీ చక్రవర్తి చాలా క్యూట్ గా కనిపిస్తుంది. సుప్రియా తన గ్లామర్ షో తో బాగానే ఆకట్టుకుంది. తేజస్విని, శ్రీముఖిల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. పోసాని కృష్ణమురళి, ప్రియదర్శిల కామేడీ పండింది. సినిమా విజువల్స్ పరంగా బాగేనా ఉంది. సినిమాటోగ్రఫీని బాగానే హ్యాండిల్ చేశారు.పాటలు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునే విధంగా లేవు. నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ సో.. సో.. గా ఉంది. దర్శకుడు నవీన్ టేకింగ్ బావున్నప్పటికీ హిందీ సినిమా ఎలా ఉందో.. అలా ప్రెజంట్ చేయడం.. తన స్టయిల్ ను చూపించే ప్రయత్నం చేయకపోవడం నిరాశకు గురి చేస్తుంది. నిర్మాణ విలువలు
బావున్నాయి. అయితే కుటుంబంతో కలిసి మాత్రం ఈ సినిమా చూడడానికి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కేవలం యూత్ కు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu