హీరోయిన్ కు పవన్ స్వీట్ షాక్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎవరితోనూ పెద్దగా కలవడానికి ఇష్టపడరు. కానీ తన తోటి నటీనటుల పట్ల అప్పుడప్పుడు తన ప్రేమను చూపించి వాళ్ళను స్వీట్ షాక్ కు గురి చేస్తుంటాడు. కాటమరాయుడు షూటింగ్ సమయంలో కూడా శివబాలాజీ పుట్టినరోజు నాడు తన ఫ్యామిలీను పిలిపించి కేక్ కట్ చేయించారు పవన్ కల్యాణ్. ఆ సర్ప్రైజ్ తో శివబాలాజీ చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు అలాంటి సంఘటన నటి అను ఎమ్మాన్యూయల్ కు ఎదురైంది. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 
ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ లో మాట్లాడుతుండగా.. అను ఫేవరెట్ ఫుడ్ అప్పం అని తెలుసుకున్న పవన్ తరువాతి రోజు తన ఇంట్లో ప్రత్యేకంగా ఆ వంటను కొన్ని కూరలను వండించి ఆమెను పంపించారట. పవన్ పంపిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని తనపై ఆయన చూపించిన ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని అను చెప్పుకొచ్చింది. అంతేకాదు తన స్నేహితులందరికీ ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పి మురిసిపోతుందట ఈ భామ.   
 
 
Attachments