టైటిల్ విషయంలో నిఖిల్ ఆలోచన !

కన్నడలో హిట్ అయిన కిరాక్ పార్టీ అనే సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. షూటింగ్ దాదాపు 70 శతం పూర్తయింది. కానీ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. మంచి టైటిల్ కోసం వెదుకుతున్నారు. ఇందులో భాగంగా ఒరిజినల్ టైటిల్ నే ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన వచ్చింది మేకర్స్ కి. నిఖిల్ సినిమాకి కిరాక్ అనే పేరు పెడితే ఎలా ఉంటుంది అనే దిశగా చర్చలు జరుపుతున్నారు.

అయితే ఈ టైటిల్ తో ఇప్పటికే ఓ చిన్న సినిమా వచ్చింది. కాబట్టి కిరాక్ అనే పేరుని ఇంకేదైనా పదాన్ని జోడించి టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే రెండు పదాలతో టైటిల్ పెట్టడానికి నిర్మాత అనిల్ సుంకర ఒప్పుకోవడం లేదు. మరో వారంలో టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.