బెజవాడకు పవన్‌

జనసేన పోరాటయాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం విజయవాడ చేరుకోనున్నారు.. రెండు రోజుల పాటు బెజవాడలోనే బసచేయనున్న జనసేన చీఫ్.. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 12వ తేదీ నుంచి తిరిగి ప్రజా పోరాట యాత్రలో పాల్గొనున్నారు పవన్ కల్యాణ్. కాగా, పోరాట యాత్రలో పవన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.