‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ రివ్యూ

టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తొలిసారిగా నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’. ‘క్లాప్‌బోర్డ్’ ప్రొడక్షన్స్ మరియు విభ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హక్కిం షాజహాన్ హీరోగా నటించాడు. 30 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిల్మ్‌కి ఆర్జే షాన్ దర్శకత్వం వహించారు. తాజాగా షార్ట్‌ ఫిల్మ్‌ విడుదలైంది. ఈ లఘుచిత్రంలో అనుపమ తన నటనతో ఆకట్టుకుంది. అత్త, మామ, పిల్లలు ఇల్లు చూసుకునే ఓ మథ్య తరగతి మహిళగా అనుపమ జీవించింది. సెక్స్‌వల్‌ ఫ్రీడమ్‌ కావాలి అంటూ భర్తతో గొడవ పడుతుంది. విషయం ఏమిటంటే.. అనుపమ తన భర్త మరో స్త్రీతో కామంతో కూడిన చాట్‌ చేయడం తన కూతురు చూస్తుంది. దానితో ఫొన్‌ చూసిన అనుపమకు ఫొటోలు, వీడియోలు కనిపించడంతో తన భర్తను నిలదీస్తుంది. దాంతో భర్తకు బుద్ది చెప్పడానికి ఈ విధంగా చేస్తుంది. ఈ సినిమాలో ఓ సాధారణ కుటుంబంలో చోటు చేసుకునే పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.’ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

CLICK HERE!! For the aha Latest Updates