HomeTelugu News'వాటర్‌ మేన్‌..'తో జనసేన అధ్యక్షుడు భేటీ

‘వాటర్‌ మేన్‌..’తో జనసేన అధ్యక్షుడు భేటీ

11 14

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జలసంరక్షణ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. వరదలు, వర్షాలు ఉన్నా జలనిర్వహణ సమర్థంగా లేదని తెలిపారు. పెరుగుతున్న వలసలకు వ్యవసాయ రంగం దెబ్బతినడమే కారణమన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణవేత్త, జల సంరక్షకుడు రాజేంద్ర సింగ్ పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం కోసం అన్వేషణ, జల సంరక్షణ, నీటి ఆవాసాలను కాపాడుకోవడంలో పాలకుల వైఫల్యాలపై ఇరువురూ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు దెబ్బ తింటున్నాయని రాజేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లమలలో యురేనియం కోసం అన్వేషణ, ఫలితంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో చెంచులు, పర్యావరణవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ రాజేంద్ర సింగ్‌తో పంచుకొన్నారు. యురేనియం తవ్వకాల మూలంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగి మానవాళి మనుగడకు ముప్పు వస్తుందని రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జల నిర్వహణ సమర్థంగా ఉన్నప్పుడే పాలన సక్రమంగా ఉన్నట్లని అభిప్రాయపడ్డారు. నదులు, తటాకాలు, చెరువులను కలుషితం అవుతున్నా ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని, పాలకులకు పర్యావరణంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. జనసేన తరఫున యురేనియం అన్వేషణ, తవ్వకాలపై నిర్వహించే సమావేశాలు, జలరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu