పవన్ ఆ డేట్ కు ఓకే!

ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. దీంతో పవన్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను ఏప్రిల్ 3నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ నెల నుండి పవన్ తన పార్టీ పనుల్లో ఇన్వాల్వ్ కావల్సివుంది.

దీంతో మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3న సినిమా షూటింగ్ ప్రారంభించాలని పవన్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా పనులను ముమ్మరం చేశారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ కుర్రాడిగా కనిపించనున్నాడు. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వ్యయంతో ఓ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జంటగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ లో కనిపించబోతున్నారు.