పవన్ ఓకే చెప్తాడా..?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జల్సా’,’అత్తారింటికి దారేది’
చిత్రాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా..?
అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కోసం
స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు.. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు
వార్తలు వినిపించాయి. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కథను బట్టి ‘దేవుడే దిగివచ్చినా’
అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం. మరి పవన్ కల్యాణ్ ఈ టైటిల్ ను అంగీకరిస్తాడో..
లేదో.. చూడాలి. ప్రస్తుతం పవన్ కల్యాణ్, డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమాలో
నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates