పవన్ తో బండ్ల సెల్ఫీ!

pawan1పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దేవుడిగా కొలిచే అభిమానుల్లో బండ్ల గణేష్ ఒకరు. అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్ కల్యాణ్ ను బండ్ల గణేష్ పొగుడుతూనే ఉంటాడు. తాజాగా కాటమరాయుడు సెట్ కి వెళ్ళిన గణేష్ ను పవన్ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. గణేష్ తో కాసేపు ముచ్చటించిన పవన్ చివరగా తనే ఫోన్ తీసుకొని సెల్ఫీ తీయడంతో గణేష్ ఆనందంతో ఉప్పొంగిపోయాడట.

ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘దేవుడితో భక్తుడి సెల్ఫీ’ అంటూ చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ తో పాటు పవన్ వీరాభిమాని నితిన్ కూడా కాటమరాయుడు సెట్ కు వెళ్ళి కాటమరాయుడు ఫ్యామిలీతో ఓ ఫోటో అంటూ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా నైజాం హక్కులను నితిన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. డాలీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మార్చి చివరి వారంలో విడుదల చేయనున్నారు.