పవన్ స్పీడ్ కు అంత మొత్తం!

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కల్యాణ్ రోజులో 12 గంటలు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క షెడ్యూల్ కు మాత్రమే కాకుండా సినిమా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలానే రోజులో 12 గంటలు పని చేయాలని నిర్ణయించుకున్నారట.

సినిమాను జులై నాటికి పూర్తి చేసి ఆగస్ట్ 11న విడుదల చేయాలనేది చిత్రబృందం ప్లాన్. దీనికోసం మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయాలి. పవన్ తో మూడు నెలల్లో సినిమాను పూర్తి చేయడం మామూలు విషయం కాదు. అందుకే ఇలా లాంగ్ కాల్షీట్స్ ప్లాన్ చేసుకున్నారు. త్రివిక్రమ్ అడగడంతో పవన్ కాదనలేక ఎక్కువ సమయం సినిమా కోసం వెచ్చించాడట. పవన్ ఇలా స్పీడ్ గా పని చేయడానికే సాధారణంగా ఆయనకు ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చారని తెలుస్తోంది.