ప్రజారాజ్యం సమయంలో ఎదురైన అనుభవాలతోనే: పవన్‌

విజయవాడలో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని.. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలు ఇవ్వండని ఆయన కోరారు. వ్యక్తిగతంగా పది వేల ఓట్లు పొందగల సామర్థ్యం ఉన్నవారిని పార్టీ తప్పకుండా అక్కున చేర్చుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజారాజ్యం సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా జనసేనని తీర్చిదిద్దుతున్నానని పవన్‌ చెప్పారు. మనది కులాలతో ముడిపడిన సమాజమని.. అన్ని కులాలతో ముందుకు సాగాలని సూచించారు.