HomeTelugu Trendingక్యాస్టింగ్‌ కౌచ్‌పై 'ఆర్‌ఎక్స్‌ 100' హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌పై ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

9 24
హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఆ తరువాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ఊపందుకున్నాక క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించడం మానేసింది. అంతా ప్రొఫెషనల్ గా పనులు జరిగిపోతున్నాయి. టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ క్రేజీ హీరోయిన్ హఠాత్తుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడే సరికి అంతా షాక్ అయ్యారు.

క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. కాకపోతే.. ఎప్పుడో జరిగిన వాటి గురించి మాట్లాడటం చూస్తున్నాం. మీటు ఉద్యమం తరువాత క్యాస్టింగ్ కౌచ్ తగ్గిపోగయింది అనుకుంటే లేదు ఇంకా ఉన్నది అని చెప్పకనే చెప్పింది ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా హిట్టయ్యాక తనకు పెద్ద సినిమాల్లో అఫర్ ఇప్పిస్తామని కొంతమంది చెప్పారట. అవకాశం ఇప్పించినందుకు కమిట్మెంట్ అడిగారని, అది ఇష్టం లేక సినిమాలు చేయలేదని, ఇప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చిన సినిమాలను మాత్రమే చేస్తున్నానని అంటోంది పాయల్. ప్రస్తుతం పాయల్ తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నది. అటు తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu