
విజయ్ దేవరకొండ మంచి నటుడు. కానీ, నటన పై కంటే కూడా.. ఈ మధ్య మిగిలిన విషయాల పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నాడు. మాట్లాడితే.. పాన్ ఇండియా కథ కావాలి అంటున్నాడు. దర్శకుడు పరశురామ్ అందుకే విజయ్ సినిమా నుంచి తప్పుకున్నాడు. పరశురామ్ రాసింది మంచి కథ, విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోతాడు. కానీ, విజయ్ మాత్రం నో చెప్పేశాడు. ‘అబ్బే.. ఇప్పుడలాంటి స్టోరీలు చేయడం లేదండి’ అనేది విజయ్ సమాధానం. ఇలాంటిదే మరో మంచి స్టోరీ. లవ్, కామెడీ, ఫ్యామిలీ సబ్జెక్ట్. మంచి సెటప్ కూడా కుదిరింది. పైగా ఈ జానర్ లో విజయ్ దేవరకొండకు గతంలో హిట్స్ కూడా ఉన్నాయి. కానీ నో చెప్పేశాడు. గట్టిగా అడిగితే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదంటున్నాడు.
అవును.. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం పాన్ ఇండియా పిచ్చి పట్టింది. తన సినిమా అన్ని రాష్ట్రాల్లో ఆడాలని, తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలని విజయ్ దేవరకొండ ఆరాటపడుతున్నాడు. తప్పులేదు, కానీ.. మంచి కథలను వదిలి పెడితే ఎలా ?. ఎక్కువ ఆశ పడుతూ విజయ్ దేవరకొండ తన మూలాల్ని మరిచిపోతున్నాడు. అక్కడే వచ్చింది అసలు సమస్య. నిజానికి విజయ్ దేవరకొండకి బాయ్ నెక్ట్స్ డోర్ అనే ఇమేజ్ ఉంది. హిట్లు కూడా అందుకే వచ్చాయి. ఎప్పుడైతే అది వదిలి విజయ్ దేవరకొండ మాస్ బాట పట్టాడో ఫ్లాపులు ఎదురయ్యాయి.
ఇప్పుడీ మాస్ అప్పీల్ కు తోడు పాన్ ఇండియా కనెక్ట్ అంటున్నాడు. మరి విజయ్ దేవరకొండ కెరీర్ ఎటు వైపు వెళ్తుందో చూడాలి. పైగా విజయ్ దేవరకొండ కంటే ఆలస్యంగా వెలుగులోకొచ్చిన సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలు ఇప్పటికే అతని కథలను తన్నుకుపోతున్నారు. హీరో నిఖిల్ కూడా కార్తికేయ 2 తో పాన్ ఇండియా సినిమా చేశాడు. నిఖిల్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. దీంతో విజయ్ దేవరకొండ కు కూడా పాన్ ఇండియాలో వరుసగా సినిమాలు చేయాలనే ఆశ పుట్టింది.
అందుకే తన మార్కెట్ ను మించి నిర్మాతతో ఖర్చు చేయిస్తున్నాడు. ఆల్రెడీ లైగర్ అనే కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ ఖాతాలో ఉన్నప్పటికీ, ఈ విషయంలో విజయ్ దేవరకొండ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఖుషి సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో చెక్కిస్తున్నాడు. నెక్ట్స్ మూవీ కోసం కూడా అలాంటి సెటప్ నే విజయ్ దేవరకొండ కోరుకుంటున్నాడు. సహజంగానే సినిమా జనాలకు ఒక పిచ్చి ఉంటుంది. విజయ్ దేవరకొండకు ఆ పిచ్చి కాస్త ఎక్కువ ఉన్నట్టు ఉంది. ఐతే, విజయ్ దేవరకొండ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఎంత పైకి ఎదిగినా అచ్చి వచ్చిన కథలను వదలకూడదు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













