పెళ్ళిచూపులు ఆ డైరెక్టర్ కే సొంతం!

రీసెంట్ గా తక్కువ బడ్జెట్ లో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘పెళ్ళిచూపులు’. స్టార్ హీరోల
సినిమాలకు పోటీగా ఈ సినిమా నిలిచింది. నిర్మాతలకు 10 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది.
కంటెంట్ ఉంటే చాలు.. సినిమాకు ఇంకేం అక్కర్లేదని నిరూపించింది. అయితే ఇప్పుడు ఈ
సినిమాను ఇతర బాషల్లో రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు. చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో అసోసియేట్ అయ్యి అక్కడ రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అలానే ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ కోసం చాలా మంది పోటీపడ్డారు. ఫైనల్ గా దర్శకుడు
గౌతమ్ మీనన్ కు ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కాయి. అయితే ఈ సినిమాకు ఆయన
దర్శకత్వం వహిస్తాడా..? లేక నిర్మాణ బాధ్యతలు మాత్రమే చేపడతాడా..? అనే విషయంలో
క్లారిటీ రావాల్సివుంది!

CLICK HERE!! For the aha Latest Updates