ముంబయి చేరుకున్న దీపిక, రణ్‌వీర్‌

బాలీవుడ్‌ నూతన జంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఈరోజు ఉదయం ముంబయి చేరుకున్నారు. ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఫొటోగ్రాఫర్లు వారిద్దరి ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి డిజైన్‌ చేసిన సల్వార్‌ కమీజ్‌, షేర్వాణీలు ధరించారు‌. తన ప్రియమైన సతీమణిని రణ్‌వీర్ తన ఇంటికి తీసుకెళ్లి గృహప్రవేశం చేయించినట్లు తెలుస్తోంది.

ఈనెల 21న బెంగళూరులో వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు. అనంతరం 28న ముంబయిలో మరో విందు కార్యక్రమాన్ని ఇవ్వనున్నారు. ఇటీవల ముంబయిలో దీపిక, రణ్‌వీర్‌ దాదాపు రూ.50 కోట్లు ఖరీదైన ఇల్లును కొనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహ విందు కార్యక్రమం అనంతరం వారిద్దరూ తమ కొత్త నివాసంలో అడుగుపెట్టబోతున్నారట.