HomeTelugu Trendingఅఫిషీయల్‌: శ్రీకాంత్‌ కొడుకు హీరోగా 'పెళ్లిసందడి'

అఫిషీయల్‌: శ్రీకాంత్‌ కొడుకు హీరోగా ‘పెళ్లిసందడి’

PelliSandaD Srikanth son
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు రూపొందించిన ‘పెళ్లిసందడి’ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 1996లో ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని మళ్లీ అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఇందులో హీరోగా నాటి ‘పెళ్లిసందడి’ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

రోషన్ ఆమధ్య నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అది ఎటూ కాని వయసు కావడంతో ఆ తర్వాత గ్యాప్ తీసుకుని, నటనలో సంపూర్ణమైన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ‘పెళ్లిసందడి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె.కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu