మరో ఆసక్తికరమైన చిత్రంతో రెడీ అవుతున్నరవితేజ..!

మాస్ మహారాజ రవితేజ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తారట. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా ఇంకొకటి కొడుకు పాత్రట. ఈ చిత్రాని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నారు. ఈ ఏడాది ఆఖరులో మొదలయ్యే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం రవితేజ, శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వత్రా ఆసక్తిని రేపుతున్న ఈ సినిమా క్టోబర్ 5న విడుదలకానుంది.