యూత్‌ని టార్గెట్‌ చేస్తూ మరో బోల్డ్‌ మూవీ!

యూత్‌ని టార్గెట్‌ చేస్తూ మరో బోల్డ్‌ మూవీ తెరపైకి రాబోతుంది. “కొత్త‌గా మా ప్ర‌యాణం” పేరుతో ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి `ఈ వ‌ర్షం సాక్షిగా` ఫేం ర‌మ‌ణ దర్శకత్వం వహిస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

టీజర్ విడుదల సందర్భంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మాట్లాడుతూ.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి క‌థ ఇది. న‌లుగురికి సాయ‌ప‌డుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అత‌డికి ప్రేమ‌, పెళ్లి, కుటుంబం వంటి విలువ‌ల‌పై అంతగా న‌మ్మ‌కం ఉండ‌దు. అయితే అలాంటివాడు మ‌న సంప్ర‌దాయం విలువ‌ను, గొప్ప‌త‌నాన్ని ఎలా తెలుసుకున్నాడనేది ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా చూపించాం అన్నారు. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా చ‌క్క‌గా న‌టించాడని కితాబిచ్చారు. హీరోయిన్ యామిని భాస్క‌ర్ అందాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌ అని తెలిపారు. ఈ చిత్రంతో హీరో హీరోయిన్‌కి మంచి పేరొస్తుందని అన్నారు. యువత లక్ష్యంగా తీసిన ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుదల చేస్తామని తెలిపారు.

టీజర్‌లో యూత్‌కి కావాల్సిన మసాలా బాగా దట్టించారనిపిస్తుంది. హీరోయిన్‌ చేయి పట్టుకుని అల్లరిపెడుతున్న రౌడీ.. అప్పుడే ఎంటరైన హీరో “అరాచకం జరుగుతుంటే చూసే వాడిని ఆడియన్ అంటారు.. ఎదిరించే వాడిని హీరో అంటారు అంటూ” సినిమాటిక్ డైలాగ్‌‌తో మొదలవుతుంది. మైండ్‌ దొబ్బిందా ఏంటి నీకు అంటూ హీరోయిన్‌ డైలాగ్‌.. అందాల విందు.. మెల్లగా సెక్స్ అండ్ రొమాంటిక్ టచ్ ఇచ్చారు. నా ప్రపోజల్ ఏం చేశావ్.. అంటూ హీరో డైలాగ్.. తర్వాత.. “ఎవరైనా
ప్రేమిస్తున్నాననో.. పెళ్లి చేసుకుంటాననో వెంటపడతారు.. నువ్వేంట్రా ఉంచుకుంటానని టార్చర్ పెడుతున్నావ్ అంటుంది హీరోయిన్. తరువాత ఒకరి మీద ఒకరు కాలేసుకుని పడుకోవడానికి మనమేం మొగుడు పెళ్లాలం కాదు. అంటూ కామక్రీడను మొదలు పెట్టారు. ముద్దులు, కౌగిలింతల్ని క్రాస్ చేసి శృంగారంలో తేలిపోయారు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో హీరోని పోలీస్‌ ఇన్‌ స్పెక్టర్ జీవా అడిగే ప్రశ్నలకు హీరో బోల్డ్‌గా డైలాగ్‌లు చెబుతాడు. ఇంతకీ మీరిద్దరూ ఎక్కడ ఉంటారు? అని అడిగితే.. ఒకే ఫ్లాట్‌లో.. ఆమె నా వైఫ్ కాదు.. లవర్ కాదు.. ఉంచుకున్నది సార్” అంటూ ఆవేశంగా చెబుతాడు.