నయన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన కాజల్‌..!

సౌతిండియాలో ఓ సీనియర్ నాయిక నెలకొల్పిన రికార్డును, మరో హీరోయిన్‌ బ్రేక్ చేయడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో నయనతార నటించిన కోలమావు కోకిల నెలకొల్పిన టీజర్ రికార్డును కాజల్ ప్యారిస్ ప్యారిస్ బ్రేక్ చేయడం విశేషం.

కాజల్ దశాబ్దానికి పైగా గ్లామర్ పాత్రలతో మెప్పించింది. ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కంగనా రనౌత్ క్వీన్ మూవీకి రీమేక్. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజన్‌ నటిస్తుండటంతో ఆసక్తిగా మారింది. ఈ చిత్రంతో కాజల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతారకు చెక్ పెట్టినట్టయింది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నయనతార చిత్రం కోలమావు కోకిల టీజర్ అత్యధికంగా 6 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు కొనసాగుతోంది. ఆ రికార్డును కాజల్ బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. కాజల్ నటించిన ప్యారిస్ ప్యారిస్ టీజర్ తక్కువ కాలంలోనే 7 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది.

కాజల్ ఏరోటిక్ సీన్‌ కారణంగానే దానికి అన్ని వ్యూస్ దక్కాయన్నది సౌత్ సినీ జనాలు అనుకుంటున్నారు. ఏదేమైనా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనకు చెక్‌ పెట్టిన కాజల్ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.