HomeTelugu Newsట్రంప్‌తో మోడీ

ట్రంప్‌తో మోడీ

11 15ప్రధాని నరేంద్ర మోడీ భారత్‌- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు. శాంతి సహా అనేక విషయాలపై జీ7 సదస్సులో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ఆయన.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురూ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ సంక్షేమానికి భారత్‌-అమెరికా కలిసి పనిచేస్తాయని మోడీ చెప్పారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. భారత్‌-పాక్‌ ఎన్నో ద్వైపాక్షిక అంశాలపై పోరాటం చేయాల్సి ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, పేదరికం లాంటి ఎన్నో అంశాలపై భారత్‌-పాక్‌ యుద్ధం చేయాల్సి ఉందన్నారు.

పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికయ్యాక ఫోన్‌ చేసి అభినందించానని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరం పలు అంశాలపై చర్చించుకున్నట్లు చెప్పారు. ట్రంప్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంపైనా సదస్సులో చర్చ జరిగిందన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు మోడీ చెప్పారని ట్రంప్‌ వివరించారు. భారత్‌-పాక్‌ రెండూ అమెరికాకు మిత్ర దేశాలని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌ విషయం భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని.. రెండు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాయని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu