బన్నీ హీరోయిన్ వింత అలవాటు!

హీరోయిన్ పూజా హెగ్దేకి ఓ వింత అలవాటు ఉందట. ఆమె ప్ర‌తి రోజు సంతోష‌ప‌డ‌డానికి కాకుండా.. బాధ‌ప‌డ‌డానికి కొంత టైం కేటాయిస్తుంద‌ట‌. కోలీవుడ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తరువాత ‘ముకుంద’ చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది. ఆ తరువాత చేసిన ‘ఒక లైలా కోసం’, బాలీవుడ్ లో చేసిన ‘మొహంజదారో’ సినిమాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చిపెట్టాయి. దీంతో ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. అయితే దీని గురించి బాధ పడడానికి అమ్మడు ప్రత్యేకంగా రోజులో 15
నిమిషాల పాటు కేటాయిస్తుందట.

త‌న సినిమాలు ప్లాప్ అవ్వ‌డం త‌న చేతుల్లో లేద‌ని..మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ పోవాల‌ని వేదాంతం మాట్లాడే ఈ అమ్మ‌డు తను ఫ్లాప్ సినిమాల గురించి బాధ పడే అలవాటుని మాత్రం మార్చుకోలేకపోతుందట. ఈ అలవాటుని రోజు చేయాలనీ నిర్ణయం తీసుకొని ఫాలో అవుతోంది. ప్లాపు సినిమాలకోసం భాధపడేవారు ఉంటారు కానీ మరీ ఇలా పూజా హెగ్డేలా రోజు 15 నిముషాలు భాధపడేవారు ఎవ‌రుంటార‌ని పూజాపై సెటైర్లు వేసేవారు లేకపోలేదు.