HomeTelugu Trendingప్రభాస్‌ 'ఆదిపురుష్‌'కి ముహూర్తం ఫిక్స్‌

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’కి ముహూర్తం ఫిక్స్‌

Prabhas Adipurush shooting
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ సినిమా ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక సీత పాత్రధారి ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బాలీవుడ్ భామ కృతి సనన్ ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంచితే, ఈ చిత్రం షూటింగును ఈ నెల 19 నుంచి నిర్వహించడానికి షెడ్యూల్స్ వేసినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ షూటింగుకి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఈ స్టూడియోలోనే జరుగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu