బన్నీకి తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్!

90ల దశకంలో తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారిలో నగ్మ కూడా ఒకరు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఆమె చాలా ఏళ్ల క్రితమే సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. మళ్ళీ ఈమె రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో అల్లు అర్జున్ అమ్మ పాత్రలో నగ్మను తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉన్న ఈ ఆలోచన త్వరలోనే ఒక కొలిక్కి రానుంది.