HomeTelugu Trendingఅఖిల్‌ కోసం రానున్న ప్రభాస్‌!

అఖిల్‌ కోసం రానున్న ప్రభాస్‌!

prabhas as guest for agentఅక్కినేని అఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్‌. ఈ సినిమా కోసం ఫ్యామిలీ,యూత్‌ ఆడియెన్స్‌తో పాటు మాస్‌ ఫ్యాన్స్‌ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా మంచి హోప్స్‌ని క్రియేట్‌ చేసింది. ఏప్రిల్ 28 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో అఖిల్‌ వరుస ప్రమోషన్‌లలో పాల్గొంటున్నాడు. కేవలం కాకినాడలో పోస్టర్‌ లాంచ్‌ కోసమే 172 అడుగుల నుంచి తాళ్ల కట్టుకుని దూకాడంటే ఈ సినిమా కోసం ఎంత ఎఫర్ట్స్‌ పెట్టాడో తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందరి కళ్లు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పైనే ఉన్నాయి.

ప్రీ రిలీజ్‌ కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈవెంట్‌కు ఎవరని గెస్ట్‌గా పిలుస్తారనేది ప్రశ్నగా మారింది. కొడుకు కాబట్టి నాగార్జున ఎలాగైనా వస్తాడు. తమ్ముడి సినిమా కాబట్టి నాగచైతన్య కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే వీరిద్దరిని గెస్ట్‌లు అనలేం.

కాగా తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ప్రభాస్‌ అతిథిగా వస్తే మాత్రం ఏజెంట్‌పై ఓ రెంజ్‌లో హైప్‌ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య న‌టిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu