HomeTelugu Trendingప్రభాస్‌ భారీ కటౌట్‌కు పాలాభిషేకం

ప్రభాస్‌ భారీ కటౌట్‌కు పాలాభిషేకం

prabhas birthday special 1పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని ఖైత్లాపూర్ గ్రౌండ్‌లో భారీ కటౌట్ ఏర్పాటుచేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఈ భారీ కటౌట్ నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, ఇప్పుడు మరోసారి ఆ కటౌట్‌కు పాలాభిషేకం చేసిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఖైత్లాపూర్ గ్రౌండ్‌లో ప్రభాస్ 230 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటుచేసినట్టు నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్టిల్‌ను కటౌట్‌గా ఏర్పాటుచేశారు. రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని ఉన్న ఆ కటౌట్ ఆకాశం అంత ఎత్తులో కనిపిస్తుంటే ప్రభాస్ అభిమానులకు చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు.

హ్యాపీ బర్త్‌డే సలార్ అని రాసి ఉన్న భారీ కేక్‌ను అభిమానులు కట్ చేశారు. అనంతరం భారీ క్రేన్ సాయంతో కొంత మంది అభిమానులు భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. పెద్ద డ్రమ్ముతో పాలను క్రేన్‌తో పైకి తీసుకెళ్లి ఆ పాలను కటౌట్‌పై పోశారు అభిమానులు. ఈ పుట్టినరోజు వేడుకలను వీక్షించేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

టాలీవుడ్‌లో టాప్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థగా ఎదిగిన శ్రేయాస్ మీడియా, సురేంద్రపురి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ పుట్టినరోజు వేడుకలను లైవ్ టెలీకాస్ట్ చేశారు. మరోవైపు, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయను సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!