HomeTelugu Big StoriesDevara: ఆస్పత్రిలో చేరిన దేవర విలన్‌.. ఏమైందంటే!

Devara: ఆస్పత్రిలో చేరిన దేవర విలన్‌.. ఏమైందంటే!

saif ali khan admitted in h

Devara: జూనియర్‌ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షణ్‌ లో తెరకెక్కుతున్న చిత్రం దేవర. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీకపూర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో అపశృతి చోటుచేసుకుంది. షూటింగ్‌లో సైఫ్‌ అలీఖాన్‌ భుజానికి గాయమైంది. దీంతో సైఫ్‌ అలీఖాన్‌ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు. సైఫ్‌ అలీఖాన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు.

కాగా దేవర షూటింగ్ తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ ముంబై ఎయిర్‌పోర్టులో నుంచి వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దేవర రెండు పార్టులుగా వస్తోంది. కాగా దేవర పార్టు-1 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్‌ అండ్‌ టీంపై వచ్చే వీఎఫ్‌ఎక్స్‌ తో సాగే అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే మెయిన్‌ హైలెట్‌గా నిలువబోతున్నట్టు టాక్‌.

అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ సినిమా పార్ట్‌-1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!