సాయిధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’.. ఫస్ట్‌లుక్‌

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’.. సినిమాతో దక్కిన సక్సెస్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందువలన మంచి కథ కోసం కొంత గ్యాప్ తీసుకుని, దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బంధాలు .. అనుబంధాల నిలయమే కుటుంబం అనే కాన్సెప్ట్ తో మారుతి తయారు చేసుకున్న కథ, ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ తో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా సగానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తేజుకి తాతయ్య పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి ఆయన పాత్ర కీలకం కానుంది. తాజాగా తాతా మనవళ్లుగా తేజు – సత్యరాజ్ పాత్రలకి సంబంధించిన పోస్టర్‌ను ఫస్ట్‌లుక్‌గా రిలీజ్‌ చేశారు. గ్రామీణ నేపథ్యంలో తాతా మనవళ్ల మధ్య అనురాగానికి అద్దం పడుతోన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.