ఫన్నీగా ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ ట్రైలర్‌

సుధీర్‌ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్‌’. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కామెడీ హర్రర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్‌ హీరోగా సీక్వెల్‌ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

హరి కిషన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్‌ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్‌ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు.