HomeTelugu Trendingసింగర్‌గా మారనున్న మలయాళ బ్యూటీ..

సింగర్‌గా మారనున్న మలయాళ బ్యూటీ..

Priya Prakash Varrier turns
మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ అంటే తెలియని వారు ఉండరు. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ అమ్మడు కన్నుగీటి, ఒక్క ముద్దు తో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆఫర్లు దక్కించుకుంది. ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రంలో నటించిన ప్రియా వారియర్.. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా తాను మాత్రం ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ బ్యూటీ చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో సింగర్ గా అవతారమెత్తబోతుందని తెలుస్తుంది. హిందీలో రూపొందుతున్న ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో ఈ బ్యూటీ ఆడి పాడబోతోందట. దీనికి సంబంధిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటితో పాటు అమ్మడి ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఆల్బమ్ లో అమ్మడు గ్లామర్ కూడా ఒలకబోయనుందని తెలుస్తుంది. తన అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేయనుందని తెలుస్తుంది. ఇక ప్రియా తెలుగులో నితిన్ సరసన ఓ సినిమా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu