HomeTelugu Trendingఅఖిల్‌కు జోడిగా నాని హీరోయిన్‌!

అఖిల్‌కు జోడిగా నాని హీరోయిన్‌!

8 26అక్కినేని అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. అప్పటి నుంచి ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎవరిని తీసుకోనున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

తాజాగా అఖిల్ జోడీగా ఒక అమ్మాయిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎవరో కాదు .. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న’గ్యాంగ్ లీడర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ‘ప్రియాంకా అరుళ్ మోహన్’. ఆకర్షణీయమైన రూపంతో ఇప్పుడిప్పుడే తమిళ.. కన్నడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది ఈ సుందరి. ‘గ్యాంగ్ లీడర్’ విడుదల తరువాత ఈ అమ్మాయి బిజీ కావడం ఖాయమనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తూ ఉండటంతో ఆమెనే అఖిల్ జోడీగా తీసుకున్నారనది తాజా సమాచారం. ఈ విషయం అధికారిక ప్రకటించాల్సి వుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu