మెట్టినింట్లో పెళ్లి.. ప్రియాంక చోప్రా సందడి

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా నివాసంలో ఒక పెళ్లి తంతు ఘనంగా జరిగింది. మరో వివాహం మాత్రం ఆగిపోయింది. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్‌ వివాహం గత వారంలోనే ఇషితా కుమార్‌ అనే యువతితో జరగాల్సి ఉంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇంట్లో వారూ వీరి పెళ్లికి అంగీకరించారు. అన్నీ కుదిరాయి అనుకున్న సమయంలో ఇషితాకు సర్జరీ జరిగింది. దాంతో వివాహాన్ని వాయిదా వేసినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇషితా, సిద్ధార్థ్‌ బ్రేకప్‌ అయ్యారని, వివాహ వేడుకను మొత్తానికే రద్దు చేసుకున్నారని తాజా సమాచారం.

ఇషితా ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. సోదరుడి పెళ్లి నిమిత్తం అమెరికా నుంచి ముంబయి చేరుకున్న ప్రియాంక.. రెండు రోజుల్లోనే తిరిగి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం గురించి ప్రియాంక నుంచి ఎలాంటి స్పందన లేదు.

మరోపక్క ప్రియాంక మెట్టినింట్లో మరో వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ప్రియాంక భర్త నిక్‌ జొనాస్‌ సోదరుడు జో జొనాస్‌ వివాహం బుధవారం ఘనంగా జరిగింది. లాస్‌వెగాస్‌లో జో జొనాస్‌.. హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates