ఎమ్మి అవార్డు వేదికపైనే నటికి ప్రపోజ్‌ చేసిన దర్శకుడు..!

ఇటీవలే అమెరికాలో 70 వ ఎమ్మి అవార్డుల వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు గ్లెన్ వీన్ కు వెరైటీ స్పెషల్ ఎమ్మి అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకున్నాక గ్లెన్.. వేదికపైన ఉన్న జాన్ అనే నటికి ప్రపోజ్ చేశాడు. ఈ సందర్భంగా గ్లెన్ మాట్లాడాడు… “ఇటీవలే అమ్మ చనిపోయింది. అమ్మలేని లోటును ఎవరు పూడ్చలేరు. అమ్మ చూపించిన ప్రేమను మరో వ్యక్తి చూపించలేరు. ఇది వాస్తవం. అమ్మలాంటి ప్రేమను చూపించగల వ్యక్తి జాన్ మాత్రమే. జాన్ నువ్వు నా ప్రేయసివి. నన్ను వివాహం చేసుకుంటావా..” అంటూ ఆమె చేతికి ఉంగరం తొడిగాడు.

ఈ దృశ్యాన్ని ఎమ్మి వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లేటు వయసులో గ్లెన్ ప్రేమకు అందరు ముద్గులవుతున్నారు. గ్లెన్ ప్రపోజ్ చేసిన విధానాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. ప్రేమకు వయసుతో సంబంధంలేదు. గ్లామర్ రంగంలో ఉండే వ్యక్తులకు ఈ విషయం గురించి బాగా తెలుసు. ఒక్కోసారి ప్రేమ లేటు వయసులో కూడా కలుగుతుందని హాలీవుడ్ దర్శకుడు గ్లెన్ వీన్ మరోసారి రుజువుచేశాడు.