యోగా అంబాసిడర్ గా ప్రియాంక!

‘క్వాంటికో’ టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఆమె ‘బేవాచ్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ‘ఏ కిడ్ లైక్ జేక్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో కొత్త హాలీవుడ్ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ సినిమా. ఈ సినిమాలో ప్రియాంక యోగా అంబాసిడర్ గా కనిపించనుంది. రెబెల్ విల్స‌న్‌, లియాం హెమ్స్‌వ‌ర్త్ లాంటి పెద్ద హాలీవుడ్ తార‌ల‌తో కలసి ఇందులో ప్రియాంక న‌టించ‌నుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలైనట్లు చిత్రదర్శకుడు టాడ్ స్ట్రాస్ తెలిపాడు.

2019 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘ఏ కిడ్ లైక్ జేక్’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలానే క్వాంటికో సిరీస్ ను మూడో సీజన్ కు పొడిగించారు.